Homeతెలంగాణహైదరాబాద్Banda Karthika Reddy: లాలాపేట్‌ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న బండ కార్తిక చంద్రారెడ్డి

Banda Karthika Reddy: లాలాపేట్‌ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న బండ కార్తిక చంద్రారెడ్డి

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): బోనాల పండుగ సందర్భంగా లాలాపేట్‌లోని పోచమ్మ దేవాలయ అమ్మవారిని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక చంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో బండ చంద్రారెడ్డితోపాటు భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

Also Read: CPI: కోడుమూరులో తాగునీటి తిప్పలు.. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News