Shilparamam Madhapur Cultural Programs: శిల్పారామం మాదాపూర్లో ఈరోజు బతుకమ్మ పండుగ రోజు పురస్కరించుకొని శిల్పారామం మహిళా సిబ్బంది బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. సందర్శకులు సైతం ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

శనివారం విశాఖపట్నం నుంచి విచ్చేసిన దీపికా బృందం కర్ణాటక గాత్ర కచేరి ఎంతగానో అలరించింది. గణపతి తాళం, అఖిల లోక పావని, శ్రీ లలిత, నవదుర్గ, తీరు తీరు జవరాల మొదలైన కీర్తనలను ఆలపించారు. వర్ణ డాన్స్ అకాడమీ నాట్య గురువులు స్మిత మాధవ్, భార్గవి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో మాంటెక్, జతిస్వరం, శారదే, క్షీరాభి కన్యకకు, అష్టలక్ష్మి, అంశాలను అమృత, కుమారి ఇషా, యశస్వినీ, గీత హన్సిక, గీన కమాలిక, సహన, రిషికలు ప్రదర్శించి మెప్పించారు.

ట్రైబల్ మేళాలో ఆదివాసీలు తయారు చేసిన ఉత్పత్తులు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

