Homeతెలంగాణహైదరాబాద్Jubilee Hills: అమీర్‌పేట డివిజన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

Jubilee Hills: అమీర్‌పేట డివిజన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

జూబ్లీహిల్స్(తెలుగు ప్రభ): సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని అమీర్‌పేట లో డివిజన్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సన్మానాలు, మహిళలకు చీరల పంపిణీ చేశారు.

- Advertisement -

అనంతరం ఎఐసిసి మెంబర్, సనత్ నగర్ ఇంచార్జి కోట నీలిమ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పార్టీకి మహిళల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. బతుకమ్మ, నవరాత్రి పండుగల సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమీర్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు నవీన్ రాజ్, కృష్ణ యాదవ్, గోవింద్ రాజ్, ప్రశాంత్, రాజేశ్వరి, రజినీకాంత్, ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News