Homeతెలంగాణహైదరాబాద్Hi Life Exhibition: హైదరాబాద్‌లో అతిపెద్ద ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌.. హెచ్‌ఐసీసీ వేదికగా మూడ్రోజుల పాటు నిర్వహణ

Hi Life Exhibition: హైదరాబాద్‌లో అతిపెద్ద ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌.. హెచ్‌ఐసీసీ వేదికగా మూడ్రోజుల పాటు నిర్వహణ

Hi Life Exhibition in HICC: అతిపెద్ద ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌కు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదిక కానుంది. అత్యుత్తమ డిజైనర్ దుస్తులు, సొగసైన కౌచర్, ప్రత్యేక ఆభరణాలు, స్టైలిష్ ఉపకరణాలు అన్ని రకాల ఫ్యాషన్‌ కలెక్షన్‌ను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈనెల 15, 16, 17 మూడు తేదీల్లో హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నారు.

- Advertisement -

భారతదేశం నలుమూలల నుండి సేకరించిన ప్రముఖ డిజైనర్‌ దుస్తులు, ఆభరణాలను ఈ హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. సాధారణ ఫ్యాషన్‌ దుస్తుల నుంచి విలాసవంతమైన ఫ్యాషన్‌ దుస్తుల వరకు వెరైటీ కలెక్షన్లను ఒకే వేదికపై తీసుకురానున్నారు. ఈ మేరకు ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nara-lokesh-meets-nitin-gadkari/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News