Homeతెలంగాణహైదరాబాద్Sama Ranga Reddy: పేదల భూములు లాక్కుంటే ఉద్యమిస్తాం.. బీజేపీ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి

Sama Ranga Reddy: పేదల భూములు లాక్కుంటే ఉద్యమిస్తాం.. బీజేపీ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, జులై 31 (తెలుగుప్రభ): హయత్‌నగర్ మండలంలోని అన్మగల్​ హయత్‌నగర్‌ ముదిరాజ్ కాలనీలోని సర్వే నంబర్ 255/1 భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శుక్రవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి రైతులు, ప్లాట్ల యజమానులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూములను ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకోవడం పేదల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. పేదలు తమ జీవితకాల పొదుపుతో కొనుగోలు చేసిన స్థలాలపై అనిశ్చితి నెలకొల్పడం సరికాదన్నారు. ప్రజల సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకుని రైతులు, ప్లాట్ల యజమానులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థులు, రైతులు, ప్లాట్ల యజమానులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, నాయకులు తడకమళ్ల విజయ్‌కుమార్, గంగాని రాము, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -

Also read:Construction of sheds: 111 జీవోలో షెడ్ల నిర్మాణం.. కళ్లు మూసుకున్న అధికారులు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News