సికింద్రాబాద్ (తెలుగుప్రభ): ప్రమాదంలో చేయి కోల్పో యిన ఆనంద్ అనే కార్మికుడికి బిజెపి నాయకులు,సమాజ సేవ కుడు డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ ఆర్థిక చేయూత అందించి మాన వ త్వం చాటుకున్నారు. తార్నాక స్ట్రీట్ నెంబర్ 3లో చిన్న డబ్బా పెట్టుకొని, సోఫా మరమ్మత్తుల పని చేస్తూ ఆనంద్ తన కుటుం బాన్ని పోషిస్తున్నాడు. పని చేస్తు న్న సమయంలో జరిగిన ప్రమా దంలో ఆనంద్ చేయి పూర్తిగా తెగిపోయింది.
ఈ విషాదకర ఘట న గురించి తెలుసుకున్న డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ వెంటనే బీజేపీ నాయకులతో కలిసి బాధితుడు ఉన్న ఆసుపత్రికి చేరుకుని పరా మర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శ్రీరామ్ వెంకటే ష్ తన స్వంతంగా రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ చెక్కును బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్య దర్శి మేకల సారంగపాణి ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంక టేష్ గౌడ్ చేతుల మీదుగా బాధి తుని కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా చికిత్సకు అవసరమైన అన్ని మందులు, తదుపరి వైద్య ఖర్చులకు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తామని డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ హామీ ఇచ్చారు.
అనంతరం శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న శ్రమజీవులకు అండగా నిలవడం నిజమైన మానవత్వం అని ఆయన చెప్పారు. సమాజంలోని అవసరమైన వ్యక్తికి చేయూత అందిస్తూ, తన వంతు సహాయం చేయడం బిజెపి నాయకుడుగా తాను గర్వపడు తున్నానని తెలిపారు. సహాయ, సహకారాలు అందించడం బిజెపి సిద్ధాంతాలకు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ సీనియర్ నాయ కులు దత్తు, బహనుమంత్ ముదిరాజ్, తార్నాక డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కరుణాకర్ , భాను ప్రకాష్, శ్రీకాంత్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

