బొల్లారం ఆర్మీ ఆయుధాల కేసు లో మరో ఏడుగురి అరెస్టు
సికింద్రాబాద్, (తెలుగుప్రభ): ఆయుధాల చోరీ కేసులో మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించా రు. కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని అరెస్టు చేసిన ట్లు మల్కాజిగిరి పోలీస్ కమిష నర్ బి. సుమతి తెలిపారు. ప్రధాన నిందితుడు మల్లేష్‌కు వీరంతా సహకరించినట్లు దర్యా ప్తులో తేలిందన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని పోలీస్ కమిష నర్ క్యాంపు ఆఫీసులో నిర్వహిం చిన మీడియా సమావేశంలో సీపీ సుమతి కేసు వివరాలను తెలిపారు. మల్లేష్ దొంగతనం చేయగా అతనికి మరో ఏడుగు రు సహకరించాలని స్పష్టం చేశారు.
వారిలో ఇద్దరు మల్లేష్ చిన్ననాటి స్నేహితులు కాగా మరో ఇద్దరు కొల్ కొత్తాకు చెందిన వారని, మిగతా వారు ఆర్మీలో పని చేసిన వారు అని వివరించారు. శేషు, వినోద్, ప్రవీణ్, నిరంజన్, మల్లికార్జున్‌తో పాటు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీర్బల్ షా, అవి దెయ్‌లను అదుపులోకి అరెస్టు చేశారు. ముందస్తు ప్రనాళిక ప్రకారం మల్లేష్ ఆయుధాలు చోరి చేసినట్లు తెలిపిన ఆమె, మిగతా వారు ఆ ఆయుధాలతో బెదరింపులతో బంగారం, బ్యాంక్ లను కొల్లగొట్టేందుకు చేశారన్నారు.
డబ్బులు సంపాధించాలనే ఆశతో…
కేవలం తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాధించాలనే ఆశ తో ఆయుధాలు చోరీ చేశా రు తప్పా మరో ఉద్దేశం లేదని వివరించారు,.ఇక పాకిస్తాన్ తో సంబంధం ఉందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.ఆయుధాల చోరీకి పాక్ సంబంధాలకు ఎటు వంటి సంబంధం లేద న్నారు.ఈ కేసులో వినోద్ పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఆయుధాల నిల్వ, సీసీ కెమెరాలు, సెంట్రీ డ్యూటీ తదితర భద్రతా ఏర్పాట్లపై అతడికి అవగాహన ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. మల్లేష్ నుంచి వినోద్‌కు ఫుట్ బాల్ గ్రౌండ్‌లో లక్ష రూపాయలు అందినట్లు వెల్లడించారు.
ప్రవీణ్ పాత్ర కూడా కీలకమని పేర్కొ న్నారు. మల్లేష్, మల్లికార్జున్, నిరంజన్ కలిసి చోరీకి ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో గుర్తించామని సీపీ తెలిపారు. బ్యాంకులో దొంగతనం ఎలా చేయాలనే అంశానికి సంబం ధించిన వీడియోను మల్లికార్జున్ మల్లేష్‌కు పంపినట్లు వెల్లడిం చారు. గతంలో కొల్ కొత్తాలో పనిచేసిన సమయంలో మల్లేష్ కు స్థానిక బీర్బల్ షా తో పరిచ యాలు ఏర్పడినట్లు తెలిపారు. దీనితో ఆయుధాలు అమ్మకానికి సంబంధించిన విషయాలు చర్చిచారని,అందులో భాగంగా చిన్న ఆయుధాలు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.

