Bomb Threat Mail to Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా(Lufthansa – LH-754) విమానంలో బాంబు ఉందంటూ అజ్ఞాత ఇ-మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు జరపగా.. ఈ బెదిరింపు మెయిల్ నకిలీదని తేల్చారు.
Also Read: https://teluguprabha.net/national-news/nta-announces-neet-ug-exam-to-be-conducted-on-june-21st/
విమానం గాలిలో ఉండగానే విమానయాన సంస్థ కస్టమర్ సపోర్ట్‌కు ఈ బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో.. వెంటనే ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే దానిని ప్రత్యేక ఐసోలేషన్ బేకి తరలించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి విమానంతో పాటు ప్రయాణికుల లగేజీని పూర్తిగా తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఫేక్ మెయిల్ ఐపీ అడ్రస్, సోర్స్‌ను ట్రాక్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గత కొన్ని నెలలుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు, వివిధ విమాన సర్వీసులకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపు మెయిళ్లు రావడం తరచుగా జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

