Boyinpally SI Nanditha: శాంతిభద్రతలను కాపాడి.. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారులు నీతి తప్పుతున్నారు. ఇటీవల పలు పోలీస్ అధికారుల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రేమ వివాహం ఉదంతంలో నిందితుడికి ఊరట కలిగిస్తానని నమ్మించి.. రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన బోయిన్‌పల్లి మహిళా ఎస్సై నందిత, స్టేషన్ రైటర్ విజయ్‌లు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
అసలేం జరిగిందంటే..?: పాత బోయిన్‌పల్లికి చెందిన అభిషేక్ అనే యువకుడు కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో తండ్రిపై అభిషేక్ దాడి చేశాడు. దీంతో బోయిన్‌పల్లి పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కోర్టు అభిషేక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం చేయాలని ఆదేశించింది.
Also read-Hyderabad: పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం
లంచం కోసం వేధింపులు: కోర్టు ఆదేశాల ప్రకారం స్టేషన్‌కు వచ్చే అభిషేక్‌ను ఎస్సై నందిత, రైటర్ విజయ్ వేధించడం మొదలుపెట్టారు. ప్రతి వారం హాజరయ్యే విషయంలో ఉపశమనం కలిగిస్తామని నమ్మించిన రైటర్ విజయ్.. ఇప్పటికే రూ.10 వేలు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎస్సై నందితకు మరో రూ.15 వేలు ఇవ్వాలని రైటర్ ఒత్తిడి చేశాడు. ఆ తరువాత మరో రూ.30 వేలు ఇవ్వాల్సిందేనని ఎస్సై నందిత డిమాండ్ చేసింది.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ: పోలీసుల వేధింపులతో విసిగిపోయిన బాధితుడు అభిషేక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ బృందం పక్కా ప్లాన్‌తో తనిఖీలు చేపట్టింది. ఎస్సై ఆదేశాల మేరకు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎస్సై నందిత, రైటర్ విజయ్‌లను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Also read-Asifabad: స్నానం చేయలేదని మందలించిన కుటుంబ సభ్యులు.. బావిలోకి దూకిన బాలిక
రిమాండ్‌కు నిందితులు: లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎస్సై నందిత, రైటర్ విజయ్‌లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే అవినీతి నిరోధక శాఖను (ACB) సంప్రదించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

