Road Accident Vanasthalipuram: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వనస్థలిపురం పరిధిలోని చింతలకుంట వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. హైవే సర్వీసు రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్రంగా గాయాల్యయాయి. అక్కాచెల్లెళ్లు అంజలి(19), పూజిత(17)గా పోలీసులు గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/national-news/iuml-again-announces-support-for-vijay/
వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్‌సెట్(EAPCET) ఇంజినీరింగ్ పరీక్ష కోసం పూజితను అంజలి తీసుకెళ్లగా.. పరీక్ష అనంతరం తిరుగుపయనం అయ్యారు. హైవే సర్వీస్ రోడ్డులో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా వారిద్దరిని కారు ఢీకొట్టింది. ఘటనలో అంజలి అక్కడికక్కడే మరణించగా.. పూజితకి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పూజితను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

