- వి. హనుమంతరావు నేతృత్వంలో మదీనా ఎక్స్‌రోడ్ నుంచి చార్మినార్ వరకు కాంగ్రెస్ తిరంగా ర్యాలీ
చార్మినార్ (తెలుగు ప్రభ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమం, అభివృద్ధి శాఖ సలహాదారు వి. హనుమంతరావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ, నిర్వహించారు. శనివారం మదీనా ఎక్స్‌రోడ్ నుంచి చార్మినార్ వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు పాదయాత్రగా ముందుకు సాగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై నిరసన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను వినిపించారు. ఈ ర్యాలీలో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్, చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ముజీబుల్లా షరీఫ్, మాజీ ఇంచార్జి కె. వెంకటేష్, బహదూర్‌పురా ఇంచార్జి పి. రాజేష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఇంచార్జి బోయ నాగేష్ తో పాటు అలాగే మొహమ్మద్ ఐజాజ్, సయ్యద్ దిలావర్ హుస్సేన్, అస్లాం షరీఫ్, అఘా రజా తబాతబాయి, ముజమ్మిల్ ఖాద్రీ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

