CM Revanth Tummidikunta Lake: హైదరాబాద్ మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైటెక్స్‌లో జరిగిన ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం.. ఆయన ఈ పనులను పర్యవేక్షించారు. చెరువు చుట్టూ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/son-commits-theft-in-own-house-for-luxurious-life/
గతంలో ఆక్రమణల కారణంగా కేవలం 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తుమ్మడికుంట చెరువుకు హైడ్రా ఆధ్వర్యంలో పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైడ్రా అధికారులు చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించి తిరిగి 28.05 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు.
తుమ్మడికుంట చెరువు పునరుద్ధరణతో పాటు చుట్టూ సుందరీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లను కేటాయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు మురుగునీరు, చెత్తాచెదారం, ట్యాంకర్ మాఫియాకు నిలయంగా మారిన ఈ ప్రాంతాన్ని పర్యావరణహితంగా, సుందరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన సీఎం.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

