సాయంత్రంలోగా రాజీనామా చేయాలని స్పష్టం.. లేకుంటే బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక
హైదరాబాద్ :మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు అందినట్లు సమాచారం. మంత్రి పదవికి రాజీనామా చేయాలని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకునేలోపే కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బర్తరఫ్ వేటు పడటం కంటే స్వయంగా రాజీనామా చేయడమే మంచిదన్న నిర్ణయానికి సురేఖ వచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, పరిస్థితిని అంతవరకు తీసుకురావద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సురేఖకు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పునరాలోచించాలని సురేఖ కోరినప్పటికీ అధిష్ఠానం నుంచి ఆమెకు ఊరట లభించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్న కొండా సురేఖ.. కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే అంశంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.

