Chit Funds Crime: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్ ఫండ్స్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వెంకట సాయి చిట్‌ఫండ్స్ పేరుతో తమ వద్ద చిట్టీలు వేసిన బాధితుల నుంచి సుమారు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/thieves-gun-fire-at-pmj-jewellery-store-in-karimnagar/
మీర్‌పేట్ వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేశ్ కుమార్, అతని భార్య వెంకట సాయి గత 10 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ స్థానికుల నమ్మకాన్ని పొందారు. ఈ క్రమంలో సుమారు 25 మందికి పైగా బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ. 2.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో చిట్టీల గడువు ముగిసినా బాధితులకు డబ్బు చెల్లించకుండా నిందితులు కాలయాపన చేశారు. నిలదీసిన బాధితులకు చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చారు. అయితే అవి బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
Also Read: https://teluguprabha.net/top-stories/minister-nara-lokesh-warns-jagan-over-tirumala-issue/
బాధితుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

