Cyberabad She Teams Raid: మహిళలను వేధించేవారిపై సైబరాబాద్ షీటీమ్స్ ఉక్కుపాదం మోపింది. బాలల భద్రత, వ్యక్తిగత రక్షణే ధ్యేయంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఈరోజు నిర్వహించిన మెరుపు దాడుల్లో పదుల సంఖ్యలో ఈవ్ టీజర్లను అరెస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/sandstorms-and-heavy-rains-in-rajasthan/
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ ప్రత్యేక మెరుపు దాడులు నిర్వహించింది. 29 మంది ఈవ్ టీజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలను అరికట్టేందుకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
ఆకతాయిల ఆటకట్టు: బహిరంగ ప్రదేశాలు, బస్టాపులు, కాలేజీలు, రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించి, వేధింపులకు పాల్పడిన 29 మంది ఈవ్ టీజర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 37 కేసులు నమోదు చేశారు. తప్పు చేసిన యువకులతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నాయి.
అక్రమ రవాణాపై పంజా: మరోవైపు అక్రమ రవాణా ముఠాపై నిఘా పెట్టిన సైబరాబాద్ ఏహెచ్‌టీయూ నలుగురు బాధితులకు రక్షణ కల్పించింది. ఇక, కుటుంబ కలహాల పరిష్కారంలో సైబరాబాద్ పోలీసుల చొరవతో 39 కుటుంబాల పునరేకీకరణకు వచ్చాయి.
మహిళా భద్రత, సైబర్ నేరాలపై 1844 మందికి డీసీపీ సృజన అవగాహన కల్పించారు. విద్యార్థులకు సైబర్ భద్రతపై పాఠాలు నిర్వహించారు. అదేవిధంగా మాదాపూర్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాలల భద్రత, వ్యక్తిగత రక్షణపై అవగాహన కల్పించారు.

