- కుల దూషణ ఆరోపణలపై దళిత సంఘాల ఆగ్రహం
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్
- విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హామీ
గండిపేట్ (తెలుగు ప్రభ): కులం పేరుతో దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మణికొండ డివిజన్ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు పట్లోళ్ల రూపారెడ్డిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న నిరసనకారులు నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించి నినాదాలు చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంఘాల ప్రతినిధులు, ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి ఆలస్యం లేకుండా అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ఇటువంటి ఘటనల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆందోళన విషయం తెలుసుకున్న నార్సింగి ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. అందిన ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి, విచారణ అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో నిరసనకారులు ఆందోళనను విరమించారు.
Also Read: Prof Jayashankar: తెలంగాణ పోలీస్ అకాడమిలో జయశంకర్ జయంతి వేడుకలు

