చార్మినార్, ఆగస్టు 4 (తెలుగు ప్రభ): ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా పాతబస్తీ హరిబౌలిలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వద్ద భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మాల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మాల్యాల మధుసూదన్ యాదవ్ లు పాల్గొని, 269 దేవాలయాలకు సంబంధించిన 2కోట్ల 7లక్షల 37వేల రూపాయల విలువ గల చెక్కులను వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఆలయాల కమిటీ ప్రతినిధులు గాజుల అంజయ్య, పొటేల్ సదానంద్ యాదవ్, ఎర్మని కైలాష్, ప్రవీణ్ కుమార్ గౌడ్, జనగామ మధుసూదన్ గౌడ్, బుల్లెట్ శ్రీధర్, హన్స్ రాజ్, సాయి ప్రకాష్, కేడాల దినేష్, కె ఎస్ ఆనంద్, రవికుమార్, ఆనంద్ గుప్త, ప్రభాకర్ ఉమ్మడి దేవాలయల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు విష్ణు గౌడ్, సతీష్ గౌడ్, అశోక్ రెడ్డి, రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Charminar Bonalu: చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం

