Homeతెలంగాణహైదరాబాద్DME Director: డీఎంఈ డైరెక్టర్‌గా డాక్టర్ ఎన్. వాణి నియామకం

DME Director: డీఎంఈ డైరెక్టర్‌గా డాక్టర్ ఎన్. వాణి నియామకం

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ ఎన్. వాణికి పదోన్నతి లభించింది. ఆమెను తెలంగాణ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీఎంఈ డైరెక్టర్‌గా ఉన్న డా. ఎ. నరేంద్రకుమార్‌ శుక్రవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో డా.ఎన్.వాణి బాధ్యతలు చేపట్టనున్నారు. వైద్య రంగంలో విశేష అనుభవం ఉన్న డా.ఎన్.వాణి ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సేవలందిస్తున్నారు. పదోన్నతిలో భాగంగా ఆమెకు డీఎంఈ డైరెక్టర్‌ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రం లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల పరిపాలనతో పాటు వైద్య విద్యాభివృద్ధికి సం బంధించిన కీలక బాధ్యతలను డీఎంఈ డైరెక్టర్‌గా ఆమె పర్యవేక్షించనున్నారు.

- Advertisement -

Also Read: Theft : సికింద్రాబాద్ స్టేషన్‌లో సిరి చోరీల సీక్రెట్ లీక్.. రూ.9.45 లక్షల పసిడి సీజ్!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News