సికింద్రాబాద్ (తెలుగుప్రభ): స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన సంపద అని, విశ్వాసంతో నిర్మించిన స్నేహమే శాశ్వతంగా నిలుస్తుందని బీజేపీ నాయకుడు,ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్ అన్నారు. స్నేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తన సందేశంలో ఆచార్య చాణక్యుడు చెప్పిన స్నేహ తత్వం నేటి సమాజానికి, రాజకీయాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. చాణక్య నీతి ప్రకారం సుఖంలో మనతో ఉండే వారు చాలామంది ఉంటారని, కానీ కష్టకాలంలో అండగా నిలిచేవారే నిజమైన స్నేహి తులని చెప్పారు. తప్పును సమర్థించే వ్యక్తి మిత్రుడు కాదని, తప్పును సరిదిద్దే ధైర్యం ఉన్నవాడే నిజమైన మిత్రుడని పేర్కొన్నారు.
రాజకీయాల్లో కూడా చాణక్యుడి సూత్రాలు అవసరమని శ్రీరామ్ వెంకటేష్ అన్నారు. రాజకీయ స్నేహం పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఉండాలని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సిద్ధాంతాలు, ప్రజల విశ్వాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిజమైన రాజకీయ మిత్రుడు కష్టాల్లో ముందుండాలని, విజయాన్ని చూసి అసూయపడకూడదని, వెనుక విమర్శించకుండా ఎదురుగా సలహా ఇవ్వాలని, పార్టీ, ప్రజల ప్రయోజనాలను వ్యక్తిగత ప్రయోజనాల కంటే గొప్పగా భావించాలని అన్నారు. కార్యకర్తలను గౌరవిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడాలని సూచించారు.
రాజకీయాల్లో స్నేహం మరింత పవిత్రంగా ఉండాలి. రాజకీయ మిత్రులు పదవుల కోసం కాదు, ప్రజల కోసం కలిసి నడవాలి. ఒకరి విజయాన్ని చూసి మరొకరు అసూయపడకూడదు. ఒకరి సేవను మరొకరు గౌరవించాలి. పార్టీ బలపడితేనే ప్రతి కార్యకర్త బలపడతాడనే భావనతో పనిచేయాలని అన్నారు.నేడు సమాజానికి అవసరమైనది కేవలం నాయకులు కాదు… మంచి స్నేహితులుగా ఉండగల నాయకులు. ప్రజల బాధను తమ బాధగా భావించే నాయకులు. సహచర కార్యకర్తలను గౌరవించే నాయకులు. విభేదాలు వచ్చినా విలువలను వదలని నాయకులు కావాలన్నారు.
రామాయణం మనకు నేర్పిన స్నేహం, ధర్మం, నిబద్ధత, త్యాగం అనే విలువలను మన వ్యక్తిగత జీవితంలోనే కాదు, రాజకీయ జీవితంలో కూడా ఆచరిద్దాం. అప్పుడు మాత్రమే బలమైన పార్టీ, బలమైన సమాజం, బలమైన భారతదేశాన్ని నిర్మించగలమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

