HomeTop StoriesDr. Vakulabharanam: లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం

Dr. Vakulabharanam: లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం

చార్మినార్‌ (తెలుగు ప్రభ): హైదరాబాద్ బోనాల సందర్భంగా ఆదివారం లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు దర్శించుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి ఇంటా శాంతి, సమృద్ధి నెలకొనాలని అమ్మవారిని కోరుకున్నారు. “బోనాలు తెలంగాణ భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలి. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి. ‘అమ్మా… అందరినీ చల్లగా చూడు’ అని మనసారా వేడుకున్నాను” అని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: Banda Karthika Reddy: లాలాపేట్‌ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న బండ కార్తిక చంద్రారెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News