Hyderabad Drunk and Drive Tests: మంత్ ఎండ్, వారాంతం.. ఇక మందుబాబులను ఆపేది ఎవరు.. పూటుగా మద్యం తాగి ఎంచక్కా ఇంటికి బయలుదేరారు. అక్కడే ట్విస్ట్.. వారాంతం కావడంతో పోలీసులు ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికోపాయారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 800 దాకా మందుబాబులను పట్టుకున్నారు. వారిలో ఎక్కువగా బైక్ రైడర్లు ఉండటం గమనార్హం..
Also Read: https://teluguprabha.net/international-news/russia-president-putin-condemns-khamenei-death/
వారాంతపు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్ర, శనివారాల్లో రాత్రిళ్లు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పెద్ద ఎత్తున మందుబాబులు పట్టుబడ్డారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 506 కేసులు నమోదు కాగా, సైబరాబాద్ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడిన వారిలో అత్యధికంగా బైక్ రైడర్లే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.
Also Read: https://teluguprabha.net/international-news/iran-interim-new-supreme-leader-ayatollah-alireza-arafi/
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అత్యధికంగా 401 మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. 47 మంది ఆటో డ్రైవర్లు, 57 మంది కారు డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. తనిఖీలు చేపట్టే సమయంలో వీరిలో బ్లడ్ ఆల్కహాల్ గాఢత(బీఏసీ) స్థాయి 300 పాయింట్లు దాటడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 10 మందికి BAC 300 పాయింట్లు దాటింది. మరోవైపు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 281 మంది పట్టుబడగా.. అక్కడా 224 మంది బైక్ రైడర్లే ఉండటం గమనార్హం.

