HomeTop StoriesViral: మద్యం మత్తులో యువకుల బీభత్సం.. ఆర్టీసీ బస్సుకు కారు అడ్డుపెట్టి యువకుల వాగ్వాదం

Viral: మద్యం మత్తులో యువకుల బీభత్సం.. ఆర్టీసీ బస్సుకు కారు అడ్డుపెట్టి యువకుల వాగ్వాదం

Viral Drunk and Drive Hyderabad: మద్యం మత్తులో నడిరోడ్డుపై యువకులు బీభత్సం సృష్టించారు. ఆర్టీసీ బస్సుకు కారు అడ్డుపెట్టి డ్రైవర్‌పై దాడి చేయడంతో పాటు బస్సు అద్దాలు పగలగొట్టారు. మాదాపూర్‌ గూగుల్‌ ఆఫీస్‌ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/adilabad-news/bjp-won-khanapur-municipality-with-brs-support/

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ గూగుల్‌ ఆఫీస్‌ సమీపంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పబ్లిక్‌ రోడ్డుపై ప్రజా రవాణా వాహనంపైనే దాడికి పాల్పడి నానా హంగామా చేశారు. ఆడి కారు ఎక్కి రోడ్డుపైకి వచ్చిన యువకులు.. ఆర్టీసీ బస్సుకు అడ్డంగా కారును పెట్టారు. తాగిన మైకంలో బస్సు డ్రైవర్‌పై దాడి చేయడంతో పాటు బస్సు అద్దాలు పగలగొట్టారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బర్కత్‌పుర డిపోకి చెందిన ఈ బస్సు.. ఆదివారం ఉదయం పటాన్‌చెరు నుంచి కోఠి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/today-ipl-match-between-sunrisers-hyderabad-srh-and-lucknow-super-giants-lsg-at-uppal-stadiu/

ఘటనా సమయంలో కారులో ఇద్దరు యువకులు, ఓ యువతి ఉన్నారని.. వారు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ మొయినుద్దీన్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News