Homeతెలంగాణహైదరాబాద్Fake Bt-3 seed: నకిలీ బీటీ-3 విత్తనాల రాకెట్‌ భగ్నం.. ఆరుగురు అరెస్ట్‌

Fake Bt-3 seed: నకిలీ బీటీ-3 విత్తనాల రాకెట్‌ భగ్నం.. ఆరుగురు అరెస్ట్‌

  •  రూ.10 లక్షల విలువైన 400 కిలోల విత్తనాలు స్వాధీనం

అబ్దుల్లాపూర్ మెట్టు (తెలుగు ప్రభ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో రైతులను మోసం చేస్తూ నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్‌వోటీ ఎల్బీనగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా ఛేదించి పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి రూ.10 లక్షల విలువైన 400 కిలోల నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి విత్తనాల రవాణాకు ఉపయోగించిన రెండు కార్లు, ఆరు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల నుంచి విత్తనాలను తెచ్చి, తెలంగాణ రైతులకు అధిక దిగుబడి వస్తుందని నమ్మిస్తూ కిలో రూ. 2,500 చొప్పున విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాగా, నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ విత్తనాల సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైతులు ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా విక్రయించే వారిపై వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

- Advertisement -

Also Read: V Hanumantha rao: నలబై కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలి.. ఎన్సీబీసీకి వీహెచ్ విజ్ఞప్తి

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News