Homeతెలంగాణహైదరాబాద్Fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. టింబర్ డిపో దగ్ధం!

Fire accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. టింబర్ డిపో దగ్ధం!

Katedan accident: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ ప్రాంతంలోని సుమిత్ టింబర్ డిపో, బి.డి. ప్లైవుడ్ గోదాముల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

వేగంగా వ్యాపిస్తున్న మంటలు: టింబర్ డిపోలో నిల్వ ఉంచిన ఎండిన చెక్కలు, కట్టెలకు మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్లైవుడ్ సామాగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు నియంత్రణలోకి రాకుండా వేగంగా పక్కనే ఉన్న గోదాములకు విస్తరిస్తున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది: సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోదాము నుంచి వెలువడుతున్న దట్టమైన నల్లటి పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

Also read-Weather report: భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

ఆందోళనలో యజమానులు: ఈ ప్రమాదంలో తమ షాపుల్లోని విలువైన సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైయ్యాయి. దీంతో భారీ స్థాయిగా నష్టం వాటిల్లిందని యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News