Homeతెలంగాణహైదరాబాద్Fire Accident: ఆసిఫ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం.. ఫర్మిచర్‌ గోదాంలో చెలరేగిన మంటలు

Fire Accident: ఆసిఫ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం.. ఫర్మిచర్‌ గోదాంలో చెలరేగిన మంటలు

Fire Accident Asif Nagar: హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ గోదాంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-cabinet-meeting-key-resolutions-on-electric-and-petrol-save/

షార్ట్ సర్క్యూట్‌ కారణంగా సీలింగ్ లైట్ కింద పడి మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదంలో గోదాంలో భద్రపరిచిన భారీ మొత్తంలో ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైంది. ఫర్నిచర్ గోదాం పైన ఉన్న రెండు అంతస్తుల్లో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్ ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన నివాసితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సకాలంలో బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News