ఉప్పల్ (తెలుగుప్రభ): ప్రజాకవి గద్దర్ (గుమ్మడి విట్టల్ రావు) 3వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయం రాఘవేంద్ర కాలనీ చౌరస్తాలో ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్) ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌన నివాళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ పాటల ద్వారా కోట్లాది ప్రజల్లో చైతన్యం నింపారని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ప్రజాకవి, ప్రజా గాయకుడు, సామాజిక ఉద్యమకారుడిగా గద్దర్ చూపిన మార్గం భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్) మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అన్న సేవలను చిరస్మరణీయంగా నిలిపేందుకు పలు చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా”గద్దర్ అవార్డులు” ఏర్పాటు చేసి కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గౌరవించడం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అన్న పట్ల చూపుతున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గద్దర్ ఆశయాలను భావితరాలకు చేర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బజార్ జగన్నాథ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రామంతపూర్ డివిజన్ కోఆర్డినేటర్, సందీప్ భూషణ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎస్సీ సెల్, డా. ఏడ్ల అంజయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నాగరాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డా.దుబ్బ రంజిత్,డా. ఆర్.ఎన్. శంకర్,డా. కిరణ్ సుకినే , సతీష్ , డా. రాజీవ్, డా.గొర్రె రాజు, ఎం.డి. అష్రఫ్ యూత్ నాయకులు, పవన్, శ్రీకాంత్ ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని గద్దర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.

