Homeతెలంగాణహైదరాబాద్Yadadri Temple: యాదాద్రి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మకు ఘన సన్మానం

Yadadri Temple: యాదాద్రి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మకు ఘన సన్మానం

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఇటీవల నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌ను తెలంగాణ పీసీసీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ప్రొఫెసర్ తలారి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉమా మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ తలారి ప్రేమ్ కుమార్, డాక్టర్ తడక యాదగిరి మాట్లా డుతూ మన్సురాబాద్ ప్రాంతంలో ఈశ్వరమ్మ పట్ల ఒక వ్యక్తి అవమానకరంగా వ్యవహరించారంటూ వచ్చిన ఆరోపణలను ప్రేమ్ కుమార్, ఉమా మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధిని అవమానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, యువజన ప్రతినిధులు కూడా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని కులం లేదా వర్గం పేరుతో కించపరచడం సరికాదని పేర్కొంటూ, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల ప్రతినిధుల ఎదుగుదలను అడ్డుకునేలా వివక్షకు తావివ్వకూడదని, సమాజం ఇటువంటి ఘటనలను వ్యతిరేకించాలని నాయకులు పిలుపునిచ్చారు.

- Advertisement -

Also read: Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.35.13 లక్షలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News