Homeతెలంగాణహైదరాబాద్Mahankali Ghatam: న్యూ బోయిగూడలో మహంకాళి అమ్మవారి ఘటానికి ఘన స్వాగతం

Mahankali Ghatam: న్యూ బోయిగూడలో మహంకాళి అమ్మవారి ఘటానికి ఘన స్వాగతం

  • పాల్గొన్న బీజేపీ యువ నాయకుడు పురురవ రెడ్డి

బేగంపేట్ (తెలుగు ప్రభ): ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా లష్కర్‌ ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఘటానికి న్యూ బోయిగూడ వాసులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఘటం న్యూ బోయి గూడకు చేరుకున్న సందర్భంగా స్థానికులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయానికి రాలేని వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధ పడుతున్న భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఆలయ నిర్వాహకులు ఘటాన్ని లష్కర్‌ పరిసర ప్రాంతాల్లోని వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఇందులో భాగంగా న్యూ బోయిగూడలో ఘట్టానికి స్థానికులు స్వాగతం పలికారు. స్థానికుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ యువ నాయకుడు మర్రి పురురవ రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను శాలువాతో సన్మానించి ఘటానికి స్వాగతం పలికే కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించారు. కార్యక్రమంలో మాంచాల గోపి, అంజిరెడ్డి, రాజు, గణేష్, శ్రీధర్, సాధు, గుంటి సత్యనారాయణ, చంద్రపాల్ రెడ్డి, వికాస్, గోపి శ్రీనివాస్, పిట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Also read: OU Distance MBA: ఓయూ డిస్టెన్స్ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News