Homeతెలంగాణహైదరాబాద్Harish Rao: జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్

Harish Rao: జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్

Revanth Vs Haish Rao: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది.కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్‌ నేత హారీశ్‌ రావు ఎద్దేవా చేశారు.

- Advertisement -

యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు, మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకు?నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధా? అంటూ ప్రశ్నించారు.

యువత డిగ్రీలు, పిజీలు పూర్తి చేసి, జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం మద్యం షాపులు పెంచి, బ్రాండ్లు పెంచి, డబ్బు వసూలు చేయాలని చూస్తోంది.టైం కు యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని ఈ చేతగాని సర్కారు.. మద్యం షాపులకు, బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తుందంటూ విమర్శించారు.

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మోసం
ఫీజు రీయింబర్స్ మెంట్ మోసం,రాజీవ్ యువ వికాసం.. వికసించక ముందే వాడిపోయింది.మేనిఫెస్టోలో చెప్పిన హామీలకు గతి లేకుండా పోయింది. రేవంత్ పగ.. యువత దగ అన్నట్లు తయారైందని హారీశ్‌ రావు అన్నారు.జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. ఇదేనా రేవంత్ రెడ్డి మీరు చెప్పిన ప్రజా పాలన? అంటూ హారీశ్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News