Homeతెలంగాణహైదరాబాద్Medicover: మెడికవర్‌లో అత్యాధునిక చికిత్స... ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే గుండె కవాట మార్పిడి

Medicover: మెడికవర్‌లో అత్యాధునిక చికిత్స… ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే గుండె కవాట మార్పిడి

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): గుండె ప్రధాన కవాటమైన అయోర్టిక్ వాల్వ్ తీవ్రంగా దెబ్బతిన్న రోగులకు, ముఖ్యంగా వృద్ధులు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే పరిస్థితి లేని వారికి ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అత్యంత సురక్షితమైన, ఆధునిక చికిత్సగా మారిందని సికింద్రాబాద్ మెడిక వర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుండె వ్యాధుల చికిత్సలో టీఏవీఐ తీసుకొచ్చిన మార్పులను వైద్యులు వివరించారు. కార్డియాలజీ విభాగ చీఫ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచులకంటి మాట్లాడుతూ సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీలో ఛాతీని తెరవాల్సి ఉండగా, టీఏవీఐ విధానంలో కాలి రక్త నా ళం ద్వారా సన్నని క్యాథెటర్ సహాయంతో కొత్త అయోర్టిక్ వాల్వ్‌ను అమర్చుతామని తెలిపారు. దీంతో తక్కువ నొప్పి, రక్తస్రావం తగ్గడం, ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండాల్సి రావడం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయోర్టిక్ వాల్వ్ వ్యాధి వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ప్రాణాంతక సమస్య అని, లక్షణాలు కనిపించి న తర్వాత చికిత్స ఆలస్యం చేయడం ప్రమాదకరమని ఆయన హె చ్చరించారు. ఛాతీ తెరవకుండా వాల్వ్ మార్పిడి చేయడం వల్ల రోగులు త్వరగా సాధారణ జీవితంలోకి తిరిగి వస్తున్నారని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాగర్ చంద్రశేఖర్ భుయార్ మాట్లాడుతూ వృద్ధాప్యం, మధుమేహం,మూత్రపిండాల వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోలేని వారికి టీఏవీఐ వరంగా నిలుస్తోందన్నారు.

- Advertisement -

Also Read: Nagole: లక్కీ రెస్టారెంట్‌లో శుభ్రత లోపం.. ఫుడ్ సేఫ్టీ నోటీసులు

ఇప్పటి వరకు ఆరు ప్రక్రియలు…

సికింద్రాబాద్ మెడికవర్ హాస్పి టల్స్‌లో ఇప్పటివరకు ఆరు టీవీఐ ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసినట్లు క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, నడిచినా లేదా మెట్లు ఎక్కినా త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుండె వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముందస్తు నిర్ధారణతో సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయాన్ని నివారించ వచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News