Highlife Exhibition: భాగ్యనగర ఫ్యాషన్ ప్రియులకు.. ముఖ్యంగా కాబోయే పెళ్లికూతుళ్లకు శుభవార్త. విలాసవంతమైన ఫ్యాషన్ మరియు పెళ్లికూతురి అలంకరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైలైఫ్ ఎగ్జిబిషన్ హైదరాబాద్‌కు వచ్చేసింది. దేశంలోని నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్ల కళాఖండాలను ఒకే వేదికపైకి తెస్తూ ఈ వేడుక సిద్ధమైంది.
అద్భుతమైన హస్తకళా సమ్మేళనం: భారతీయ సంప్రదాయ హస్తకళను మరియు ఆధునిక శైలిని మేళవిస్తూ రూపొందించిన అత్యుత్తమ డిజైన్లు ఈ హై లైఫ్ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరనున్నాయి. ఆధునిక భావాలు గల మహిళల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన అద్భుతమైన పెళ్లికూతురి దుస్తువులను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలు ప్రదర్శితం కానున్నాయి. పండుగ ప్రత్యేక వస్త్రాలతో పాటుగా స్టైలిష్ వేసవి దుస్తులు సైతం ఈ ఎగ్జిబిషన్ మెరువనున్నాయి.
Also read-Minister Damodar: ‘ఆరోగ్యంతోనే మానసిక దృఢత్వం సాధ్యం’
ఏప్రిల్ 10 నుంచి 12 వరకు: ఈ నెల 10 నుంచి 12 వరకు హైదరాబాద్‌లోని ప్రముఖ హెచ్‌ఐసీసీ(Novotel HICC)వేదికగా ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ముందెన్నడూ లేని విధంగా ఫ్యాషన్ అనుభూతిని పొందాలని కోరుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.


