Highlife Exhibition: భాగ్యనగర ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త. ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైలైఫ్ ఎగ్జిబిషన్ హైదరాబాద్‌లో సరికొత్త సీజన్‌ను ప్రారంభించనుంది. దేశంలోని నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్ల కళాఖండాలను ఒకే వేదికపైకి తెస్తూ ఈ వేడుక సిద్ధమైంది.
అద్భుతమైన హస్తకళా సమ్మేళనం: భారతీయ సంప్రదాయ హస్తకళను మరియు ఆధునిక శైలిని మేళవిస్తూ రూపొందించిన అత్యుత్తమ డిజైన్లు ఈ హై లైఫ్ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరనున్నాయి. ఆధునిక భావాలు గల మహిళల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన అద్భుతమైన పెళ్లికూతురి దుస్తువులను ప్రదర్శించనున్నారు. మీరు సమకాలీన సొగసు, కాలాతీత క్లాసిక్స్ లేదా స్టేట్‌మెంట్ స్టైల్స్ కోసం చూస్తున్నా, వాటన్నింటినీ ఒకే చోట పొందేందుకు హై లైఫ్ ఎగ్జిబిషన్ అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలు ప్రదర్శితం కానున్నాయి. పండుగ ప్రత్యేక వస్త్రాలతో పాటుగా స్టైలిష్ వేసవి దుస్తులు సైతం ఈ ఎగ్జిబిషన్ మెరువనున్నాయి.
జూన్ 12 నుంచి 14 వరకు: ఈ నెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని ప్రముఖ హెచ్‌ఐసీసీ(Novotel HICC)వేదికగా ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ముందెన్నడూ లేని విధంగా ఫ్యాషన్ అనుభూతిని పొందాలని కోరుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.


