HomeTop StoriesCrime: పెళ్లికి నిరాకరించిందని హెచ్‌ఐవీ ఇంజెక్షన్.. అవమానభారంతో యువతి ఆత్మహత్య

Crime: పెళ్లికి నిరాకరించిందని హెచ్‌ఐవీ ఇంజెక్షన్.. అవమానభారంతో యువతి ఆత్మహత్య

Crime HIV Injection Victim Suicide: చిన్ననాటి నుంచి ప్రేమించిన మరదలు.. తనకు ఎయిడ్స్‌ ఉందనే కారణంతో పెళ్లికి నిరాకరించడంతో ఆమెకు సదరు యువకుడు హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అయితే బాధితురాలికి వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ.. అవమానభారానికి గురైన యువతి మానసిక వేదనతో తన ప్రాణాలనే వదిలేసుకుంది. హైదరాబాద్‌ శివారు పోచారం ఐటీ కారిడార్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/100-robotic-heart-surgeries-in-155-days-world-record-for-jubilee-hills-apollo/

జనగామ జిల్లాకు చెందిన మనోహర్ (25) కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్‌ అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటోంది. అయితే మనోహర్‌ తల్లిదండ్రులిద్దరికీ హెచ్‌ఐవీ పాజిటివ్ ఉండగా.. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. మరోవైపు మనోహర్‌ తన ఇంటికి సమీపంలోని మరదలిని ఇష్టపడుతున్నాడు. కుటుంబీకుల సమక్షంలో వీరిద్దరికీ గత నెలలో నిశ్చితార్థం జరిగింది. అయితే, మనోహర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ అని తెలియడంతో ఆమె కుటుంబం ఆ పెళ్లిని రద్దు చేసుకుంది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు.. తన మరదలు ఎవరికీ దక్కకూడదనే కోపంతో ఓ ప్లాన్‌ వేశాడు. తనకి కూడా హెచ్‌ఐవీ ఉంటే ఆమెను మరొకరికి ఇచ్చి పెళ్లి చేయరనే ఉద్దేశంతో ఓ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మార్చి 11న మనోహర్ యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో, పక్కా ప్లాన్‌తో తన వెంట తెచ్చుకున్న సిరంజితో తన రక్తాన్నే ఆమె శరీరంలోకి ఎక్కించి పారిపోయాడు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-says-land-records-with-the-strongest-security-possible-using-blockchain-technology/

ఆ తర్వాత యువతికి తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మార్చి 15న పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి, కుంగుబాటుకు లోనైన ఆ యువతి గురువారం రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో మనోహర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News