- పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు
- ఆలయ 12 రోజుల ఆదాయం 9 లక్షల 90వేల726 రూపాయలు
చార్మినార్ (తెలుగు ప్రభ): లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ హుండీ ఆదాయం లెక్కింపు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు , ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు రంగరమేష్ గౌడ్, ఎ.మాణిక్ ప్రభు గౌడ్, బంగ్లా రాజు, సి.వెంకటేష్, పోసాని విజయ్ కుమార్, కె.రవిరాజ్ ల పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయానికి 12 రోజులకు గాను నగదు రూపంలో 6లక్షల 26 వేల 226 రూపాయలు, రెండు యుఎస్ డాలర్లు, 10 పౌండ్స్ చొప్పున రెండు ఇంగ్లాండ్ నోట్ లతో పాటు
,ఒడి బియ్యం చిరల వేలం వల్ల వచ్చిన నగదు రూ. 2,10,000 పూజా కార్యక్రమాల టికెట్ విక్రయాల ద్వారా రూ.83,820, కొట్టిన కొబ్బరికాయల విక్రయాల వల్ల వచ్చిన నగదు రూ. 25వేలు,శాంతి కళ్యాణం కానుకల రూపం లో రూ.45,680 రాగా మొత్తం 9 లక్షల 90వేల726 నగదును అధికారులు హై కోర్టు ఆదేశాల మేరకు బ్యాంక్ లో డిపాజిట్ చేయగా హుండీ లెక్కింపు లో వచ్చిన 0.06 గ్రాముల బంగారం,0.28 గ్రాముల వెండి,170 గ్రాముల జెర్మన్ సిల్వర్ ను నాణ్యత టెస్టింగ్ నిమ్మితం భద్రపరిచినట్టు సి ఎఫ్ ఓ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా నాలుగు హుండీలకు వేసిన సీజ్ లను తొలగించి లెక్కించగా, మరో హుండీ తెరుచుకోకపోవడంతో హుండీ దాత సమక్షంలో వెల్డింగ్ మిషన్ తో లాక్ కట్ చేసి హుండీని లెక్కించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి.కృష్ణ, ఇన్స్పెక్టర్లు సురేందర్, రాజేశ్వరి, సురేఖ, ఇ. ఓ లు శ్యాం సుందర్, ఎం.వెంకటేశ్వర్ రావు, జలేందర్ రెడ్డి, నాగరాజు, రవీందర్ రెడ్డి రామ్ నరేష్, తేజ, శ్రీనివాస్ రావు, శివకుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

