Homeతెలంగాణహైదరాబాద్Bonalu : పాతబస్తీలో ఘనంగా ఘటాల ఊరేగింపు.. భక్తిపారవశ్యంలో భాగ్యనగర సంబరాలు!

Bonalu : పాతబస్తీలో ఘనంగా ఘటాల ఊరేగింపు.. భక్తిపారవశ్యంలో భాగ్యనగర సంబరాలు!

చార్మినార్ (తెలుగు ప్రభ) : ఆషాఢమాసం బోనాల నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భాగ్యనగర్​ శ్రీ మహంకాళి జాతర ఉత్సవాలు ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం  పాతబస్తీలోని అమ్మవారి ఆలయాలలో ఘటాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి…బాజా భజంత్రీలు….బ్యాండు మేళాలు…విచిత్ర వేషధారణలు…వివిధ ఆకృతులతో కూడిన  భారీ షకటాలతో భారీ జనసాంద్ర్యత నడుమ అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుకు పాతబస్తీ ప్రజలు, భక్తులు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద అమ్మవారి ఘటాలకు పూలతో స్వాగతం పలుకుతూ… సాక పెడుతూ…మంగళ హారతులు పట్టారు.

- Advertisement -

ముందుగా షాలిబండాలోని శ్రీ కాశీ విశ్వనాథస్వామి దేవాలయంలో పాతబస్తీకి చెందిన 23 ప్రధాన దేవాలయాలకు చెందిన అమ్మవారి ఘటాలకు ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయం, బంగారు మైసమ్మదేవాలయం,  ఉప్పగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్​షాహి శ్రీ జగదాంబదేవాలయం, రేణుక ఎలమ్మదేవాలయం, శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, బేళా శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, శివాజీనగర్ శ్రీ నాగ శివపార్వతి దేవాలయం, మాతేశ్వరి పోచమ్మదేవాలయం తదితర అమ్మవారి ఆలయాల ఘటాలను షాలిబండా నుంచి సామూహిక ఊరేగింపుగా వెళ్లి ఆలయాలలో శాస్త్రోక్తంగా ప్రతిష్థాపన పూజలు నిర్వహించారు.

 అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపులో భాగంగా దారిపొడవునా చార్మినార్ జోన్ డీసీపీ ఖరె కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా మోడ్ వద్ద  ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల యాదయ్య, టీపీ సీ సీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్ కుమార్, రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ బండారు రాధికలు అమ్మవారి ఘటాలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా దారి పొడవునా భక్తులు అమ్మవారి ఘటానికి సాక పెట్టి, పూలతో ఘనంగా స్వాగతం పలికారు. 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కమిటీ అధ్యక్షుడు మధుసుదన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి విష్ణు గౌడ్, మాజీ కార్పొరేటర్ ఆలే భాగ్య లక్ష్మి, వివిధ ఆలయ కమిటీ చైర్మన్​లు గాజుల అంజయ్య, రాకేష్​ తివారి, ఎర్మని కైలాష్​, జనగామ మధుసూధన్​గౌడ్​, పొటేల్​ సదానంద్​ యాదవ్​, హన్స్ రాజ్, పొన్న వెంకట రమణ, అశోక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ గౌడ్,ఆర్.ప్రభాకర్, కె. వెంకటేష్,అరవింద్ కుమార్ గౌడ్, రాజుయాదవ్, ఎస్​.పి క్రాంతికుమార్​, శశాంక్ తివారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News