HomeTop StoriesHyderabad: హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా

Hyderabad: హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా

Telangana police jobs:హైదరాబాద్ లోని ఇందిరా పార్క్‌ చౌరస్తాలో నిరుద్యోగులు ఒక్కసారిగా మెరుపు ధర్నా నిర్వహించారు.కేవలం 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్‌ ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్‌ ప్రభుత్వం విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా పోలీస్‌ ఉద్యోగాల వయోపరిమితి కూడా పెంచాలంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు.

- Advertisement -

నోటిఫికేషన్ ఆలస్యంతో వేల మంది అభ్యర్థుల వయోపరిమితి దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:Rangam: ఈ ఏడాది కుంభవర్షాల్లో ప్రజలు కొట్టుకుపోతారు..రంగంలో మాతంగి

, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News