హైదరాబాద్ (తెలుగు ప్రభ): నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చైతన్యపురి పీఎస్ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలో మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో డెడ్ బాడీని వెలికి తీశారు. మృతుడి వయస్సు సుమారు 40 నుండి 50 ఏండ్ల మధ్య ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. గుండ్రటి ముఖం, ఛామన్చాయ నలుపు రంగు లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎడమ చేతిపై ‘ఆర్ఎం’ అనే పచ్చబొట్టు గుర్తింపు లక్షణంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని చైతన్యపురి ఎస్‌హెచ్‌వో సైదులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Patanjali: బీమా రంగంలోకి పతంజలి ఎంట్రీ.. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం

