Wednesday, February 18, 2026
Homeతెలంగాణహైదరాబాద్Head & Neck Cancer: యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో హెడ్‌ & నెక్‌ ఆంకాలజీ సమ్మిట్‌..

Head & Neck Cancer: యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో హెడ్‌ & నెక్‌ ఆంకాలజీ సమ్మిట్‌..

Head & Neck Cancer Summit 2026: హైటెక్‌ సిటీ యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో 500 మందికిపైగా ప్రముఖ ఆంకాలజీ వైద్య నిపుణులతో అంతర్జాతీయ “హెడ్&నెక్” ఆంకాలజీ సమ్మిట్-2026 నిర్వహించారు. “హెడ్ & నెక్” క్యాన్సర్‌ను అత్యంత ఖచ్చితత్వంతో ముందస్తుగా గుర్తించడం కోసం AI- ఆధారిత హెడ్ & నెక్ ఆంకాలజీ క్లినిక్‌ను ప్రారంభించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/international-news/india-russia-su57-stealth-fighter-jets-make-in-india/

క్యాన్సర్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు విస్తృతమవుతున్నాయి. చికిత్స లేని వ్యాధిగా ముదిరిన క్యాన్సర్‌కు చెక్‌ పెట్టేందుకు వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఆంకాలజీ విభాగం నిర్వహించిన అంతర్జాతీయ “హెడ్ & నెక్ ఆంకాలజీ సమ్మిట్-2026”‌ సదస్సును సైబరాబాద్ సీపీ, డాక్టర్. ఎం. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా ఆంకాలజీ వైద్య నిపుణులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.

Yashoda Hospitals cancer

ఈ సమ్మిట్ సందర్భంగా యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలో హెడ్ & నెక్ క్యాన్సర్‌ను అత్యంత ఖచ్చితత్వంతో ముందస్తుగా గుర్తించడం కోసం AI- ఆధారిత హెడ్ & నెక్ ఆంకాలజీ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ క్లినిక్ ద్వారా రోగికి సంబంధించిన జన్యుపరమైన, మాలిక్యులర్ ప్రొఫైల్‌ను విశ్లేషించవచ్చు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన చికిత్సలు.. రోబోటిక్ సర్జరీ, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యునోథెరపీ వంటి AI-ఆధారిత చికిత్స ప్రణాళికను అందించడంపై దృష్టి సారిస్తుందని యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జీఎస్ రావు తెలిపారు. 

Also Read: https://teluguprabha.net/national-news/ncp-merger-jayant-patil-revelations-sharad-ajit-pawar-maharashtra-politics/

“భారత్‌లో తల, మెడ క్యాన్సర్లు మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 30 శాతంగా ఉన్నాయని సీపీ డాయ రమేష్‌ పేర్కొన్నారు. ఏడాదికి 2,25,000 కొత్త కేసులు, 1,25,000 మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. దేశంలో 50-70 ఏళ్ల వయస్సు వాళ్ళలో ఈ హెడ్ & నెక్ క్యాన్సర్ సర్వసాధారణంగా ఉన్నప్పటికీ, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడ అధిక శాతం మంది రోగులు చిన్న వయస్సులోనే ఈ రోగం బారిన పడుతున్నారని వెల్లడించారు. ఈ క్యాన్సర్‌ను అత్యంత ఖచ్చితత్వంతో ముందస్తుగా గుర్తించడం కోసం యశోద హాస్పిటల్స్ దీర్ఘకాల నిబద్ధతను, అత్యుత్తమ రోగి ఫలితాల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ఏకీకరణను నొక్కి చెబుతుందని సీపీ వివరించారు.

Yashoda Hospitals head and neck cancer

ఈ హెడ్ & నెక్ క్యాన్సర్ క్లినిక్ ఆంకాలజీ వైద్య శాస్త్రంలో ప్రపంచ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని క్లినికల్ డైరెక్టర్ & రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్. చినబాబు సుంకవల్లి తెలిపారు. ఈ సమ్మిట్‌లో అంతర్జాతీయ ప్రఖ్యాత అధ్యాపకులు డాక్టర్. జతిన్ పి. షా, డాక్టర్. అనిల్ కె. డి’క్రూజ్‌తో పాటు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా ఆంకాలజీ వైద్య నిపుణులతో.. హెడ్ & నెక్ ఆంకాలజీలో ఉద్భవిస్తున్న పోకడలు, భవిష్యత్తు చికిత్స వ్యూహాలు, మల్టీమోడల్ చికిత్స ప్రణాళికపై నిపుణుల నేతృత్వంలో లోతైన చర్చ జరిగినట్లు డాక్టర్. చినబాబు సుంకవల్లి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News