Wednesday, February 11, 2026
Homeతెలంగాణహైదరాబాద్Hyderabad: భాగ్యనగరంలో పతంగుల పండుగ.. నేటి నుంచే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్!

Hyderabad: భాగ్యనగరంలో పతంగుల పండుగ.. నేటి నుంచే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్!

International Kite Festival హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడుతోంది. పండుగ సంబరాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి (జనవరి 13) నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

- Advertisement -

పరేడ్ గ్రౌండ్స్‌లో రంగుల లోకం: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ వేదికగా జరిగే ఈ ఫెస్టివల్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు కనువిందు చేయనుంది. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ తమ విన్యాసాలతో ఆకాశాన్ని రంగులమయం చేయనున్నారు. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Also read-China Manja: చైనా మాంజాపై హైదరాబాద్‌ పోలీసుల పంజా.. రూ. కోటికి పైగా విలువైన సామగ్రి స్వాధీనం.!

ప్రత్యేక ఆకర్షణలు: ఈ ఏడాది పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అదనంగా రెండు ప్రధాన ఈవెంట్లను నిర్వహిస్తోంది. జనవరి 16, 17, 18 తేదీలలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆకాశంలో రంగురంగుల బెలూన్లు విహరించనున్నాయి. అంతేకాకుండా జనవరి 16, 17 తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 9:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యాధునిక డ్రోన్ షోలను నిర్వహించనున్నారు. సాంకేతికతతో కూడిన ఈ విన్యాసాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నాయి.

ఉచిత ప్రవేశం: నగరవాసులు, పర్యాటకులు అందరికీ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రవేశాన్ని పూర్తిగా ఉచితంగా ఉంచింది. రంగురంగుల గాలిపటాలు, నోరూరించే మిఠాయిలు, అబ్బురపరిచే డ్రోన్ ప్రదర్శనలతో ఈ సంక్రాంతిని చిరస్మరణీయంగా మార్చుకోవాలని అధికారులు ఆహ్వానిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News