Homeతెలంగాణహైదరాబాద్Kandi Shravan Reddy: హబ్సిగూడాలో ఘనంగా బంజారా సీత్లా భవాని వేడుక

Kandi Shravan Reddy: హబ్సిగూడాలో ఘనంగా బంజారా సీత్లా భవాని వేడుక

ఉప్పల్ (తెలుగుప్రభ): వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పశువులు బాగుండాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుతూ గిరిజన సోదర సోదరీమణులు జరుపుకునే సీత్లా భవాని పూజ హబ్సీగూడలో ఘనంగా జరిగింది.

- Advertisement -

హబ్సిగూడ వెలుగుగుట్ట సీత్లా దేవి ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హబ్సిగూడ కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షులు కంది శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. కంది శ్రవణ్‌ కుమార్‌ రెడ్డికి బంజారా సోదరులు శాలువా కల్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన కొబ్బరికాయ కొట్టి సీత్లాదేవికి పూజలు చేశారు.

గిరిజనుల సాంప్రదాయ నృత్యాలను తిలకించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షులు గణేష్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు మాలు నాయక్‌, రాజు నాయక్‌, యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ వాసు నాయక్‌, సుమన్‌ నాయక్‌, గుండు రాజన్న గిరిజన బంజారా సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Also Read: NTA Failure: నిప్పులు చెరిగిన నిరసన: నిర్లక్ష్యపు ‘ఎన్‌టీఏ’పై ఏఐఎస్ఎఫ్ సమరశంఖం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News