Homeతెలంగాణహైదరాబాద్Bangaru Babu: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బంగారు బాబుకి షాక్‌.. గోల్డ్‌ అంతా సీజ్‌.!

Bangaru Babu: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బంగారు బాబుకి షాక్‌.. గోల్డ్‌ అంతా సీజ్‌.!

Konda Vijay Kumar Alias Bangaru Babu: న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన బంగారు బాబును ఎయిర్‌పోర్టులోనే ఐటీ అధికారులు పట్టుకున్నారు. బంగారు బాబు ఒంటి మీద ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్‌ చేయడంతో పాటు ఇతర ఆస్తుల వివరాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/rahul-ramakrishna-brother-passed-away-due-paraquat-poisoning/

ఒంటి మీద కేజీల కొద్దీ గోల్డ్‌ జ్యువెలరీతో ఫేమస్‌ అయిన రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన బంగారు బాబు అలియాస్‌ కొండ విజయ్‌ కుమార్‌ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి గురువారం సాయంత్రం బంగారు బాబు బయలుదేరారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులోనే ఆయన స్థానిక ఐటీ అధికారులు అడ్డుకొని పాన్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/bellamkonda-sai-sreenivas-engagement-and-marriage-date-fix-details-inside/

అనంతరం కొండ విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడి ఢిల్లీ ఇన్‌కమ్‌ టాక్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకొని ఎయిర్ పోర్టులోనే విచారణ ప్రారంభించారు. బంగారు బాబు ఒంటిపైన ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు ఆయన పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 12 గంటల పాటు విచారించిన అధికారులు.. అనంతరం అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లడానికి అనుమతిచ్చారు. అనంతరం ఆయనను మళ్లీ విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. అయితే సీజ్ చేసిన బంగారాన్ని తిరిగి ఇస్తారా, వారిని విడుదల చేస్తారా అనేది బంగారు బాబు ఇన్‌కమ్‌ టాక్స్ చెల్లింపుల పైన ఆధారపడి ఉంటుందని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News