రాజేంద్రనగర్ (తెలుగు ప్రభ): నార్సింగి సర్కిల్ పరిధిలోని ప్రజల శ్రేయస్సు, సుఖ శాంతులు ప్రతి కుటుంబంపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకున్నానని నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీశ్రీ తెలిపారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం మణికొండలోని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధల నడుమ నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీశ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వడిబియ్యం సమర్పించి తన మొక్కును తీర్చుకున్నారు. ఆమె ప్రజలందరు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా లక్ష్మీశ్రీ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించి భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శైలజ, వందన, బిందు, కొల్ల కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: KIMS : తల్లీ పాల ఆవశ్యకత… ‘కిమ్స్ కడల్స్’ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

