సికింద్రాబాద్ (తెలుగుప్రభ) : లష్కర్ ఉజ్జయిని మహం కాళి అమ్మవారి బోనాల ఏర్పాట్ల పై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.క్యూ లైన్లలో రోడ్డు పైనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్తితి నెలకొందని వాపోయారు.ఇక బోనం తో భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినా గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్తితి నెలకొంది. వీఐపీ ల తాకిగి పెరగడంతో సామాన్య భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్తితి నెలకొంది. వీఐపీ లు వచ్చిన ప్రతి సారి సామాన్య భక్తులను దర్శనానికి ఆపేయడంతో బోనాలు ఎత్తుకున్న మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అలాగే మధ్యాహ్నం అమ్మవారిని దర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన రాకకు అరగంట ముందు నుండి సామాన్య భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు.దీంతో బోనం ఎత్తుకుని క్యూలో ఉన్న వారు నీరసించిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కొంత మంది భక్తులు చిన్నపిల్లలతో వచ్చి దర్శనానినికిక్యం అవుతుండటంతో చాలా ఇబ్బందులు పడ్డారు.
కనిపించని కమిటీ మెంబర్లు : ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఏడాది కొత్తగా 14 మంది సభ్యులతో కూడిన కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. వీరే కాకుండా మరో ముగ్గురు సభ్యులను రెండు రోజుల క్రితం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . అయితే ఈ ఉత్సవాలు సజావుగా సాగేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన కమిటీ సభ్యులు భక్తులకు సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలయ ప్రాంగ ణంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి సహకరించినందుకు కనీసం ఒక్క సభ్యుడు కూడా కనిపించిన దాఖలాలు లేవని అంటున్నారు. కమిటీ సభ్యులం తా భుజాలపై కండువాలు,మెడలో ఐడీ కార్డులు వేసుకొని తమ నాయకులు వచ్చినప్పుడు వారి వెంట తిరగడం తప్ప వారి చేసింది ఏమీ లేదని పలువు రు భక్తులు బహిరంగంగానే ఆరోపిం చారు. కమిటీ సభ్యులు తమ కుటుంబ సభ్యులను, తమకు తెలిసిన వారిని నేరుగా తీసుకెళ్లి అమ్మవారిని దర్శనం చేయించేందుకు చొరవ చూపారే తప్ప సాధారణ భక్తులను పట్టించుకో లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యులు తమ సొంత పనులకు కేటా యించిన సమయంలో పావువంతు సమయం తమకు కేటాయిస్తే క్యూ లైన్ లో తమ గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొనేవి కాదని పలువురు భక్తులు వాపోయారు.
శివ శక్తుల ఆగ్రహం : బోనాల పండగ సందర్భంగా ఆలయాల వద్ద పోలీసుల వైఖరి, ఎండోమెంట్స్ ,ప్రభుత్వ నిర్వహ ణపై శివశక్తులు,జోగిను లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశా రు.నిష్టతో బోనాలు ఎత్తుకొని దర్శనానికి వచ్చిన తమను పోలీ సులు నెట్టివేయడం,తీవ్ర ఇబ్బం దులకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. పండగ సందర్భం గా అమ్మవారికి ఉపవాసం ఉండి బాణంతో వచ్చిన తాము అమ్మవారి దర్శనానికి చాలా సేపు వేచి ఉండటంతో నీరసంతో వల్ల కళ్ళు తిరిగాయి దీంతో బో నాలు పడిపోయాయని కొంద రు శివ శక్తులుకన్నీరుమున్నీరయ్యా రు.గతప్రభుత్వాల హయాంలో బోనాలకు సంబంధించి కొంత వరకు సరైన ఏర్పాట్లు ఉండేవి అని, కానీ ఈ ప్రభుత్వం కేవలం సమీక్షా సమావేశాలకే పరిమిత మైం దని వారు విమర్శించారు. శివశక్తుల కోసం ప్రత్యేక పాస్‌లు, సదుపాయాలు కల్పిస్తామని చెప్పి, చివరకు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు.
బోర్డు మెంబర్లుగా లేదా ఉత్సవ కమిటీ ల్లో శివశక్తులకు భాగస్వామ్యం కల్పించకపోవడం వల్లే ప్రతి ఏటా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అమ్మవారి సేవలో తరిస్తున్న తమలాంటి జోగినుల ఏడుపు, ఆవేదన రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని శివశక్తులుహెచ్చరించారు. రాజకీయనాయకుల కోసమే పండగలను,ఏర్పాట్లను వాడు కుంటున్నారని, క్షేత్రస్థాయిలో భక్తులకు, శివశక్తులకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకొని, తమ పట్ల సరైన చర్యలు తీసుకో వాలని వారు డిమాండ్ చేశారు.

