Homeతెలంగాణహైదరాబాద్Gas cylinder: సామాన్యుడికి గ్యాస్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

Gas cylinder: సామాన్యుడికి గ్యాస్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

Gas cylinder price: అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సామాన్య ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వంట గ్యాస్ (LPG) ధరలను భారీగా సవరించాయి. గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరపై ఏకంగా రూ. 60 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

- Advertisement -

ప్రధాన నగరాల్లో సిలిండర్ ధరలు: తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో గతంలో ఉన్న ధరలకు అదనంగా రూ. 60 పెరగడంతో.. ప్రస్తుతం సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. ఏపీలోని విజయవాడలోనూ ఇదే స్థాయిలో పెరగడంతో సిలిండర్ ధర సుమారు రూ. 937.50 వద్ద కొనసాగుతోంది.

గ్యాస్ సిలిండర్ ధరలు:

  • వరంగల్: రూ.984
  • హైదరాబాద్: రూ.965
  • విజయవాడ: రూ.937.50
  • విశాఖపట్నం: రూ.921
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News