Homeతెలంగాణహైదరాబాద్Sky Baba: ప్రముఖ సాహితీవేత్త స్కైబాబకు జాతీయ సమైక్యత అవార్డు

Sky Baba: ప్రముఖ సాహితీవేత్త స్కైబాబకు జాతీయ సమైక్యత అవార్డు

National Integration Award: ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు షేక్ యూసుఫ్ బాబా (స్కైబాబ)ను ప్రతిష్టాత్మకమైన బాబుమియా బ్యాండ్‌వాలే జాతీయ సమైక్యతా అవార్డు వరించింది. తన రచనల ద్వారా సామాజిక రంగానికి చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షులు డాక్టర్ షంసుద్దీన్ తంబోలి తెలిపారు.

- Advertisement -

సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం: స్కైబాబ తన రచనలతో ఆకట్టుకుంటారు. అంతేకాకుండా సమాజంలోని మైనార్టీల సమస్యలపై ఆయన రాసిన కవితలు, కథలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా.. పలు సామాజిక ఉద్యమాల్లో సైతం చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను పెంపొందించేలా కృషి చేసే వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ.. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించే వారిని ప్రోత్సహించడమే బాబుమియా బ్యాండ్‌వాలే జాతీయ పురస్కారం ఉద్దేశం.

అభినందనల వెల్లువ: స్కైబాబకు ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించడం పట్ల తెలుగు సాహిత్య లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. పలువురు కవులు, సామాజిక వేత్తలు సైతం ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. సమాజంలోని సమస్యల పట్ల మరిన్ని రచనలు రాస్తూ.. పాలకులను మేల్కొలపాలని ఆకాంక్షించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News