HomeTop StoriesGreen Channel: గ్రీన్‌ ఛానెల్‌ సక్సెస్‌.. బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కి ఊపిరితిత్తులు

Green Channel: గ్రీన్‌ ఛానెల్‌ సక్సెస్‌.. బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కి ఊపిరితిత్తులు

Lungs Transfer From Bengaluru to Kims Secunderabad Green Channel: ఒక ప్రాణాన్ని భూమి మీదకు తీసుకురావడానికి డెలివరీ సమయంలో మాతృమూర్తి మరో జన్మ ఎత్తుతుంది. అందుకే అమ్మను దైవంతో పోలుస్తారు. మరి ఆ ప్రాణానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే తమ శాయశక్తులా ప్రయత్నించి మరో జన్మను అందిస్తారు వైద్యులు. అందుకే వైద్యో నారాయణ హరి అంటారు. ఒకరు ప్రాణం పోస్తే.. మరొకరు పునర్జన్మని ఇస్తారు. కాబట్టే వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి.. చావు అంచుల వరకు వెళ్లిన వారికి సైతం మరో జీవితాన్ని అందిస్తున్నారు. ఇక బతకడానికే అవకాశం లేదు అనుకున్న వాళ్లకి.. అవయవదానంతో మరో అవకాశం ఇస్తున్నారు. మనిషి జీవితం అంత విలువైనది కాబట్టే.. ఆర్గాన్‌ల రవాణా సమయంలో ప్రతి క్షణం ఎంతో కీలకంగా భావిస్తారు. గంటల్లో చేరాల్సిన లక్ష్యాన్ని కేవలం నిమిషాల్లోనే చేరుస్తున్నారు. అలాంటి అరుదైన ఘటన హైదరాబాద్‌లో మరోసారి చోటుచేసుకుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-performed-the-bhoomi-pooja-for-basara-temple-development-works/

సోమవారం బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు హైదరాబాద్ పోలీసులు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటుతో విజయవంతం చేశారు. ఓ వ్యక్తికి అత్యవసరంగా లంగ్స్‌ను అమర్చాల్సి ఉంది. దీనికోసం దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యాహ్నం 2:20 గంటలకు తీసుకువచ్చారు.

Also Read: https://teluguprabha.net/telangana/30-maoists-surrender-before-telangana-police-along-with-keshalu/

విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి వరకు ఈ ఆర్గాన్స్‌ అంబులెన్స్‌లో చేరాల్సి ఉంది. అందుకే వేగంగా చేరుకోవడానికి పోలీసులు ట్రాఫిక్ లేని ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి కిమ్స్‌ ఆస్పత్రికి 35 కి.మీ దూరాన్ని కేవలం 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ చేరుకుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News