Homeతెలంగాణహైదరాబాద్Hyderabad: పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం

Hyderabad: పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం

Olid City: పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రసిద్ధ ఎస్‌వైజే (SYJ) కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో బట్టలు ఎక్కువగా ఉండటంతో క్షణాల వ్యవధిలోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

- Advertisement -

రంగంలోకి 8 ఫైరింజన్లు: సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా 8 ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News