Homeతెలంగాణహైదరాబాద్Banjara Hills: భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి నాలుగు ఫైర్‌ ఇంజిన్లు

Banjara Hills: భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి నాలుగు ఫైర్‌ ఇంజిన్లు

Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 10లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలోని సెల్లార్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా (HYDRAA) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకుపోయిన 11 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.

- Advertisement -

సహాయక చర్యలకు ఆటంకం: సెల్లార్‌లో వైన్‌షాప్‌కు చెందిన గోదామును నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గోదాములో పెద్ద ఎత్తున సరుకు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఫలితంగా దట్టమైన పొగ భవనం చుట్టూ అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read-Telangana: నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. అర్హతలు ఇవే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News