Homeతెలంగాణహైదరాబాద్Fire Accident Hayat Nagar: హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్‌తో ఫర్నీచర్ షాపు...

Fire Accident Hayat Nagar: హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్‌తో ఫర్నీచర్ షాపు దగ్ధం

Major fire in Hayat Nagar furniture shop: నగర శివారు హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాపులో వేగంగా మంటలు అంటుకున్నాయి. నెమ్మదిగా మొదలైన మంటలు.. క్షణాల్లోనే పక్కనే ఉన్న పరుపుల షాపుకు విస్తరించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్‌ స్థంబించింది. వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్‌లోని జయశ్రీ ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్‌వేర్ షాపులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న పరుపుల తయారీ షాపుకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత రెట్టింపైంది. పరుపులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి.. ఆ రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల ధాటికి సమీపంలోని మరో రెండు షాపులు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి.

- Advertisement -

Also read: https://teluguprabha.net/national-news/update-on-neet-ug-paper-re-exam/

భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా..

ఈ ప్రమాదంలో షాపుల బయట నిలిపి ఉంచిన ఒక బైక్ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సమాచారం అందుకున్న వెంటనే హయత్ నగర్ అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, షాపు లోపల పరుపుల నిల్వలు ఉండటంతో.. మంటలు ఆర్పడానికి చాలా సమయం పట్టింది. ఈఘటనలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News