IPL 2026 Tickets Black Selling: ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్(SOT) పోలీసులు ఉక్కుపాదం మోపారు. టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు కేటాయించిన టికెట్లను ఈ ముఠా అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐపీఎల్ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని టికెట్లను బ్లాక్‌లో భారీ ధరలకు అమ్ముతున్న ముఠాను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/tvk-chief-vijay-books-a-resort-in-mahabalipuram/
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఒక్కో క్లబ్ సెక్రటరీకి కేటాయించిన 17 టికెట్లను అక్రమ పద్ధతిలో ముఠా సేకరించేది. వాటిని సామాన్య అభిమానులకు భారీ రేట్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ విక్రయాల్లో క్లబ్ సెక్రటరీల హస్తం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. టికెట్లను అనధికారికంగా అమ్మేవారిని నమ్మి మోసపోవద్దని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

